కరీంనగర్ జిల్లా లో దారుణ హత్య జరిగింది. ఏడు నెలల గర్భిణీ నీ గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే హత్యకు ఆస్తి తగాదాలే కారణమని కొడుకే సవతి తల్లి నీ హతమార్చారని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు – రేణుక కు ఇద్దరు కుమారులు. అయితే రాములు గత ఏడు సంవత్సరాల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో మహిళను వివాహం చేసుకొని టేకుర్తిలో ఉంటున్నాడు.
Also Read:Bandi Sanjay : బాలయ్య… వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు మీ సేవలకు దక్కిన గుర్తింపు
ఇద్దరు భార్యలు వేరే వేరే ఇంట్లో ఉంటుండగా గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తిరుమల ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ ఇంట్లో ఎవరు లేని సమయం లో మొదటి భార్య కొడుకు సవతి తల్లిని గొంతు కోసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.