బాలీవడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఈ బ్యూటీ దేశంలోనే మోస్ట్ డేరింగ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఆమె కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి బెరుకూ లేకుండా బయటకు చెప్పేస్తుంది. అలా ఆమె కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపిన వివాదాలు ఎన్నో. అందుకే ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని కూడా అంటారు. అయితే ఆమె బోల్డ్ యాటిట్యూడ్ కొంతమంది దృష్టిని మాత్రం ఆకట్టుకుందనే చెప్పాలి. Read…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి వివాదాల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదైనా బోల్డ్ గా చెప్పడమే కాదు బోల్డ్ గా చూపించడం లో కూడా అమ్మడికి ఎవరు సాటిరారు. తాజాగా నడిరోడ్డుపై కంగనా చేసిన అందాల ఆరబోత చూసి బాలీవుడ్ మీడియా నోళ్లు వెళ్లబెడుతోంది. క్వీన్ కంగన నటించిన యాక్షన్ చిత్రం ధాకడ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ లుక్ లో మేకప్ అయ్యి ఇలా కారు దిగుతూ…
మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడటం బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కు చేతకాదు. ఏ విషయం గురించైనా తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఆమె రకరకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ వస్తోంది. చిత్రం ఏమంటే కంగనా రనౌత్ మీడియా ముందుకు వస్తే చాలు… ఆమెను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కాంట్రావర్సీ లోకి లాగడం ఉత్తరాది మీడియాకు అలవాటుగా మారింది. అలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హీరో షాహిద్…
వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు వెండితెర కథానాయికులను తాము చేసే పనులకు ఉపమానంగా ఉపయోగించడం ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. ఆ మధ్య హేమమాలిని, కత్రినా కైఫ్ చెక్కిళ్ళపై కామెంట్ చేసినట్టుగానే తాజాగా ఝార్ఖండ్ కు చెందిన ఓ శాసన సభ్యుడు కంగనా రనౌత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్తారా ఇర్ఫాన్ అన్సారీ అనే ఈ ఎమ్మెల్యే త్వరలో తన నియోజవర్గంలో 14 వరల్డ్ క్లాస్ రోడ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోందని చెప్పాడు.…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసిన సంచలనమే.. ఏమి మాట్లాడినా వివాదాస్పదమే.. అందరు చేసే పనిని ఆమె చేయదు. సాధారణంగా కొత్త సంవత్సరం స్టార్ లందరు కుటుంబాలతో కలిసి పార్టీలు చేసుకుంటారు.. గోవా, మాల్దీవులు అంటూ ట్రిప్ లకు వెళ్తారు. ఇప్పటికి పలువురు తారలు అదే పని చేస్తూ కనిపించరు కూడా… అయితే వారిలా నేనెందుకు చేయాలి అనుకున్నదో ఏమో కంగనా నేడు రాహు కేతు పూజలో పాల్గొని దైవ భక్తిలో మునిగిపోయింది. నేడు…
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సిక్కు వివాదంలో ఈరోజు ముంబై పోలీసుల ఎదుట హాజరు కానుంది. కంగనా బుధవారం తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంగనా రనౌత్ ఈరోజు ఉదయం 11 గంటలకు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఖార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవచ్చు. సిక్కు వివాదం ఏంటి ?వాస్తవానికి కంగనా…
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పంజాబ్ లో రైతుల సెగ తగింది. ఆమె కారును పలువురు రైతులు కీరత్‌పురలో అడ్డుకున్నారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్‌పూ ర్ సాహిబ్ వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. అయితే, కంగానా రనౌత్ కారుపై దాడి గురించిన సమాచారం ఏదీ తన వద్ద లేదని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివారాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు. కాగా……
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్రెండింగ్ లో ఉన్న ఏ విషయాన్ని వదలదు. అన్నింటిలోనూ కలుగజేసుకొని తనదైన రీతిలో స్పందిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయాలలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే రిజైన్ చేయడం, ఆయన ప్లేస్ లో ఇండో అమెరికన్ పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టడం. పరాగ్ బాధ్యతలు తీసుకుంటున్నాడని తెలిసినప్పటినుంచి ఇండియన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ ట్రెండింగ్ న్యూస్ పై నటి…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తకాదు.. నిత్యం ఆమె వివాదాలతోనే సహజీవనం చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న ముద్దుగుమ్మ పెళ్లిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ ప్రేమికుడిని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో ఫైర్ బ్రాండ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అభిమానులు తెగ సంతోషించారు. అయితే ఆ ఆనందం మూడునాళ్ళ ముచ్చటే అన్నట్లు ఉంది. తాజాగా కంగా ఇన్స్టాగ్రామ్…
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు కష్టాలు తప్పేలా లేవు.నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా స్వాతంత్ర్యం గురించి చేసిన అనుచి వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. గతంలో స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై ఎందరో కంగనాపై విరుచుకుపడ్డారు. దేశంలో పలుచోట్ల నిరసనలు సైతం వ్యక్తం చేశారు. ఆఖరికి ఆమెకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని సైతం తిరిగి…