కంగనా రనౌత్ ను టార్గెట్ చేసిన ఝార్ఖండ్ ఎమ్మెల్యే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు వెండితెర కథానాయికులను తాము చేసే పనులకు ఉపమానంగా ఉపయోగించడం ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. ఆ మధ్య హేమమాలిని, కత్రినా కైఫ్ చెక్కిళ్ళపై కామెంట్ చేసినట్టుగానే తాజాగా ఝార్ఖండ్ కు చెందిన ఓ శాసన సభ్యుడు కంగనా రనౌత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్తారా ఇర్ఫాన్ అన్సారీ అనే ఈ ఎమ్మెల్యే త్వరలో తన నియోజవర్గంలో 14 వరల్డ్ క్లాస్ రోడ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోందని చెప్పాడు. అంతటితో ఆగిఉంటే బాగానే ఉండేది. అయితే ఆ రోడ్లు కంగనా రనౌత్ బుగ్గల కంటే నున్నగా ఉంటాయని కామెంట్ చేశాడు. అంతే కాదు… ఆ హామీ ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముందే ప్రత్యర్థి వర్గాలు రంగంలోకి దిగి, సదరు ఎమ్మెల్యేను, అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని కూడా వివాదంలోకి లాగాయి. ‘లడకీ హూ.. లడ్ సక్తీ హూ’ అనే ప్రియాంక ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుంది? అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
గత నెలలో మహారాష్ట్ర వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ మినిస్టర్ గులాబ్ రావ్ పాటిల్ తన జల్ గావ్ నియోజకవర్గంలోని రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోల్చాడు. గత నవంబర్‌లో రాజస్థాన్ మినిస్టర్ రాజేంద్ర సింగ్ గుథా తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గలంత నునుపుగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి. చిత్రం ఏమంటే… ఎన్ని విమర్శలు తమపై వస్తున్నా ఈ రాజకీయ నేతలకు దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంటోంది! చేసిన తప్పునే పదే పదే చేయడం అలవాటుగా మారింది అంటున్నారు జనాలు
Also Read
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!