అద్భుతమైన నటనతోనో, జాతీయ అవార్డులతోనో లేదంటే కాంట్రవర్సీలతోనో వార్తల్లో ఉంటుంది కంగనా రనౌత్. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా పచ్చనైన సందేశంతో నెటిజన్స్ ముందుకొచ్చింది. కంగనా 20 చెట్లు నాటింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చిన్నపాటి సందేశాన్ని కూడా తన ఫాలోయర్స్ కి ఇచ్చింది ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్…ఈ మధ్య వచ్చిన తౌక్టే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో కల్లోలం సృష్టించింది. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు,…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ హెగ్డే పై రేప్ కేసు నమోదైంది. ముంబైలోని డిఎన్ నగర్ లో కుమార్ పై రేప్, అన్ నాచురల్ సెక్స్, చీటింగ్ కేసులు నమోదు చేసింది ఓ మహిళ. మే 19న కేసు నమోదు చేసిన ఆ మహిళ కుమార్ హెగ్డే తనను మోసం చేశాడని, చాలాసార్లు లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా తన దగ్గర 50 వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం… గత సంవత్సరం…
అక్కినేని సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డీ-గ్లామర్ లుక్ లో సమంత తన పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసించింది. సామ్ బోల్డ్ పాత్రతో పాటు ఆమె నటనను అభినందించింది. ఇన్ స్టా వేదికలో స్పందించిన కంగనా ‘దిస్ గర్ల్ హేస్ మై…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. కొద్దీ రోజుల క్రితం హింసను ప్రేరేపించే ట్వీట్లు చేసిందంటూ ఆమె కథను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే కంగనాకు కరోనా సోకింది. ఈ విషయన్ని కంగనా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని తెలుపుతూ ఆమె యోగా చేస్తున్న పిక్ ను…
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జయ కేతనం ఎగరేసిన నేపథ్యంలో పలు నియోజక వర్గాలలో హింస చెలరేగింది. బీజేపీ, ఏబీవీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని చోట్ల టీసిఎం కార్యకర్తలు వాటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన బీజేపీ కార్యకర్తలు, పోలీసులపై దాడి చేశారు. బీజేపీ సానుభూతి పరుల దుకాణాలను కొన్ని చోట్ల లూఠీ చేశారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్…
కోవిడ్ -19 కేసులతో పాటు దేశంలో ఆక్సిజన్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎక్కువ చెట్లను నాటాలని ప్రజలను కోరుతూ సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆక్సిజన్‌ను ఉపయోగించే వ్యక్తులు గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆమె అన్నారు. “అందరూ ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. టన్నులు టన్నులు ఆక్సిజన్ సిలిండర్లను పొందుతున్నారు. మనం పర్యావరణం నుండి ఫోర్స్ ఫుల్ గా తీసుకుంటున్న…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా పొగడదని అంటారు. అయితే అందులో వాస్తవం లేదు. తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా పొగుడుతూ ఉంటుంది. ఇటీవల అదే జరిగింది. దర్శకుడు మిలన్ లూధ్రియా ‘ది డర్టీ పిక్చర్’ను తొలుత కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్ కు లభించింది. ఆ సినిమాతో విద్యా బాలన్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించింది. ఆమెకు విశేష ఖ్యాతిని తెచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా తీయబోతున్నట్టు కంగనా తెలిపింది. నిజానికి…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమి చేసినా అది చర్చనీయాంశమే అవుతుంది. ‘రిజైన్ మోదీజీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో కొందరు నెటిజన్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడంతో కంగనాకు చిర్రెత్తుకొచ్చింది. ‘మోదీకి పాలించడం రాదు, సచిన్ కు బ్యాటింగ్ చేయడం రాదు, కంగనాకు నటించడం రాదు, లతాజీకి పాడటం రాదు’ అన్నట్టుగా కొందరు మోదీపై విషం కక్కుతున్నారంటూ కంగనా నిన్న ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనను మోదీతో,…