గత కొంతకాలంగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘థాకడ్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. చైల్ట్ ట్రాఫిక్ మీద రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ నటించింది. అందులో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను చేసింది. కానీ పేలవమైన కథ, కథనాల కారణంగా ‘థాకడ్’కు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ మూవీ ఇంత దారుణంగా పరాజయం పొందడం ఇదే…
మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు దేశం లోపల, బయట రచ్చకు కారణం అయ్యాయి. పలు ఇస్లామిక్ దేశాలు భారత్ కు తన నిరసన వ్యక్తం చేశాయి. అయితే భారత్ కూడా ఇదే స్థాయిలో వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు…
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు! దేశంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి. ముస్లిం దేశాలు సైతం ఈ వ్యవహారంపై మండిపడ్డాయి. అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అయితే.. దేశంలో కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని, ప్రవక్తపై కామెంట్స్ చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు.. నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసినా, ఆమెపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…
బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ, ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది. రిలీజ్‌కి ముందు వచ్చిన…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఏది చేసినా సంచలనమే.. అన్నింటిలోనూ తానే నంబర్ వన్ గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కంగనా ఒక లగ్జరీ కారును సొంతం చేసుకుంది. మే బ్యాక్ ఎస్680 కంపెనీకి చెందిన లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేసింది. దీని ధర అక్షరాలా రూ. 3.5కోట్లు. దిమ్మ తిరుగుతోంది కదా.. ఇంకా విశేషమేంటంటే ఈ లగ్జరీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్‌గా కంగనా నిలిచింది. ప్రస్తుతం ఈ కారుతో కంగనా…
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏ ముహూర్తాన అమ్మడిని ఫైర్ బ్రాండ్ అని పిలిచారో అప్పటినుంచి ఏదో ఒక నిప్పు అంటిస్తునే ఉంది. పెద్ద, చిన్నా.. సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు అని ఏమి లేకుండా ఆమె మనసుకు నచ్చింది మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తూ విమర్శల పాలు కావడం కంగనాకు అలవాటుగా మారింది. ఇక మరోసారి బాలీవుడ్ స్టార్స్ పై కంగనా ఫైర్…
అందాలు ఆరబోయడంలోనూ, అందుకు తగ్గ అభినయం ప్రదర్శించడంలోనూ కంగనా రనౌత్ సదా అభినందనలు అందుకుంటూనే ఉంటుంది. అంతలేంది… జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలుస్తుందా చెప్పండి! కేవలం నటనతోనే కాదు, తనకు చాలాకాలంగా అలవాటయిన వెటకారంపైనా కంగనాకు ఎంతో మమకారం ఉందని మరోమారు తేలిపోయింది. అవకాశం చిక్కితే చాలు తారల వారసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కంగనా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అనన్య పాండేపై కంగనా ఓ సెటైర్ వేసి మళ్ళీ వార్తల్లో నిలచింది. చాలా రోజులుగా ‘నెపోటిజమ్’పై…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీవుడ్ మీడియా వాటిని కాంట్రవర్సీ చేసి డిబేట్ లు పెడుతున్న విషయం విదితమే. ఇక తాజాగా కంగనా ఈ వ్యాఖ్యలపై…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది అనిపిస్తుందో మొహమాటం లేకుండా అదే ముఖం మీద చెప్పేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటె కంగనా ఒక్కత్తే ఒక వైపు ఉంది. తన కు నచ్చనివారి గురించి ట్విట్టర్ ద్వారా ఏకిపారేయడం అమ్మడికి అలవాటే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పటికీ మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇక…