బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఏది చేసినా సంచలనమే.. అన్నింటిలోనూ తానే నంబర్ వన్ గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కంగనా ఒక లగ్జరీ కారును సొంతం చేసుకుంది. మే బ్యాక్ ఎస్680 కంపెనీకి చెందిన లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేసింది. దీని ధర అక్షరాలా రూ. 3.5కోట్లు. దిమ్మ తిరుగుతోంది కదా.. ఇంకా విశేషమేంటంటే ఈ లగ్జరీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్‌గా కంగనా నిలిచింది. ప్రస్తుతం ఈ కారుతో కంగనా కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా నేడు రిలీజ్ అయిన విషయం విదితమే.
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రజనీష్ దర్శకత్వం వహించాడు. అయితే సినిమా రిజల్ట్ గురించి పట్టించుకోకుండా కంగనా క్కారు కొనడం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే విజయాపజయాలను పట్టించుకోనని, తనకు నచ్చిన పాత్రలను, తానూ ఏదైనా చేయగలను అని నమ్మి వచ్చిన డైరెక్టర్ల సినిమాలను మాత్రమే చేస్తాను అని ఎప్పటినుంచో కంగనా చెప్తూనే ఉంది. ప్రస్తుతం అమ్మడి సినిమా గురించి కన్నా కంగనా కొన్న కారు గురించే బీ టౌన్ చర్చించుకోవడం విశేషం. మరి సినిమా రిజల్ట్ పై కంగనా ఏమంటుందో చూడాలి.