Kangana Ranaut: ‘మా’ ప్రెసిడెంట్ కు థాంక్స్ చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
“ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్ ముఖత్ , అతని సతీమణి కృష్ణ ముఖత్ తో పాటు చిత్రబృందంలోని కొంతమంది కలిసి శ్రీవారిని దర్శించుకున్నాం. తిరుమల దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణుకు, ధర్మారెడ్డి గారికి స్పెషల్ థాంక్స్” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపొయితే కంగనా నటించిన ‘ధాకడ్’ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించిన ‘ధాకడ్’ మూవీలో కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా నటించింది. అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఫైర్ బ్రాండ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
తాజావార్తలు
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!