Dhaakad: ఖర్చేమో 90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ, ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది.
రిలీజ్‌కి ముందు వచ్చిన ప్రోమోలు, ట్రైలర్స్ చూసి.. ‘ధాకడ్’ సినిమా ఒక లేడీ ర్యాంబో మూవీగా బాలీవుడ్‌లో సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇది అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో, మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ళు దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. ఎనిమిదో రోజు అయితే కలెక్షన్లు మరీ ఘోరంగా వచ్చాయి. దేశం మొత్తం మీద కేవలం 20 టికెట్లే అమ్ముడుపోయాయి. దీంతో.. కలెక్షన్లు రూ. 4420 మాత్రమే వచ్చాయి. కంగనా లాంటి స్టార్ హీరోయిన్ సినిమా, ఇంత చెత్త వసూళ్ళను కలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ. 90 కోట్లు. ఇప్పటివరకూ ఇది నమోదు చేసిన షేర్ రూ. 5 కోట్లలోపే బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన.. నష్టాలు రూ. 85 కోట్ల పైమాటే! దీంతో.. ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చిన బిగ్జెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరింది.
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!