లోకనాయకుడు నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. జూలై 16న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చురుగ్గా జరుగుతోంది. “విక్రమ్” చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి టాలెంటెడ్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో చేరనున్నారు. “విక్రమ్”ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీని, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “విక్రమ్” చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
Read Also : బాలకృష్ణ వ్యాఖ్యలపై ట్రోలింగ్
ఇటీవల మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ముగ్గురినీ చూపించారు. “విక్రమ్” వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి రానున్నాడు. కాగా ఈ మూవీ ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా చెప్పబడుతున్న విషయం ఏమిటంటే కమల్ హాసన్ అంధుడిగా నటించబోతున్నారు. కమల్ పాత్రపై నెట్టింట్లో ఏ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతకుముందు 1981లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో “రాజా పార్వై”లో కమల్ హాసన్ అంధుడి పాత్రలో నటించారు. ఇప్పుడు మరోసారి అంధుడి పాత్రను పోషించబోతున్నాడు.