ఉలగనాయగన్ కమల్ హాసన్ చాలా విరామం తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. “విశ్వరూపం-2” చిత్రంతో చివరగా వెండితెరపై ప్రేక్షకులను పలకరించాడు కమల్. ఈ చిత్రం 2018లో విడుదలైంది. రాజకీయాల కారణంగా మధ్యలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ 2, లోకేష్ కనగరాజ్ తో ‘విక్రమ్’ చిత్రం చేయనున్నారు. ఇందులో ‘ఇండియన్ 2’ పలు వివాదాల కారణంగా ఆగిపోయింది. దీంతో కమల్ తన మిగతా చిత్రాలపై ఫోకస్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “విక్రమ్” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
Read Also : ఆయుష్మాన్ ఖురానా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్
ఈ ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ఉన్నారు. ముగ్గురూ సీరియస్ లుక్ లో కన్పిస్తున్నారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. అన్బరివ్ (అన్బు మరియు అరివు) స్టంట్ మాస్టర్స్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు.