సినీ తారల అభిమానానికి ఎల్లలు ఉండవంటారు. అది నిజమే… తమిళ నటుడు కమల్ హాసన్ అభిమాని, కేరళలోని కోజికోడ్ కు చెందిన నేహా ఫాతిమా ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ సరికొత్త ప్రపంచరికార్డ్ ను సృష్టించింది. చుక్కలు, గీతలు లేకుండా కేవలం కమల్ హసన్ పేరును మాత్రమే రాస్తూ, ఆయన పోర్ట్ రేట్ ను గీసింది. లారెస్ట్ స్టెన్సిల్ వర్డ్ ఆర్ట్ విభాగంలో పెన్ పెన్సిల్ తో వైట్ చార్ట్ పై రెండు గంటల యాభై నిమిషాల్లో నేహా ఫాతిమా ఆ బొమ్మను గీసింది. ఈ రేఖా చిత్రంతో నేహా ఫాతిమా వజ్రా వరల్డ్ రికార్డ్ ను అందుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేయడం విశేషం.
Read Also : న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్టార్ హీరోయిన్