కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అలానే క్లయిమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చి, మూవీ గ్రాఫ్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్ళాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.…
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో.. సూర్య గెస్ట్ రోల్ పోషించిన ‘విక్రమ్’ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపింది. కెజీయఫ్ చాప్టర్ 2 తర్వాత.. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత కమల్కి పెద్ద హిట్ రావడంతో ఫుల్ జోష్లో ఉన్నారు. దాంతో ఈ సినిమాకి పని చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్, పార్టీలు ఇస్తూ…
ఉలగనాయగన్ కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కలుసుకోవడం నిజంగా విశేషమే. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అభిమానులకు సంబరమే. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ `విక్రమ్` చిత్రం థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను, చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను తన నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించారు చిరంజీవి. సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్ను కూడా చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పిక్చర్స్ తోపాటు 1986లో `స్వాతిముత్యం` శతదినోత్సవం సందర్భంగా…
మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను…
విశ్వనటుడు కమల హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. దీంతో నేడు థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, హీరో రానా, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విక్రమ్ సినిమా అన్ని సినిమాలను క్రాస్ చేసి హయ్యస్ట్ రేంజ్ లోకి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ కెరీర్ లో పెద్ద హిట్ ఎక్కువ గ్రాసర్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.…
గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు ఎట్టకేలకు భారీ విజయం దక్కింది. ‘ఖైదీ’ చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ‘మాస్టర్’ చిత్రంతో కుర్రకారును సైతం మెప్పించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కించాడు.. ఒక హీరో అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో లోకేష్ నిరూపించాడు. జూన్ 3 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు కలెక్ట్…
విశ్వనటుడు కమల్ హాసన్ ఎట్టకేలకు విక్రమ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కొన్నేళ్లుగా తెరపై కనిపించకపోయినా, ప్లాప్ సినిమాలు వెక్కిరిస్తున్నా.. వేటికి జంకకుండా కుర్ర డైరెక్టర్ లోకేష్ ను లైన్లో పెట్టి కష్టపడి విక్రమ్ ను తెరకెక్కించాడు కమల్.. లోకేష్ కనగరాజ్ మొదటి నుంచి కమల్ ఫ్యాన్ అవ్వడంతో తన అభిమానాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించేశాడు. స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఎక్కడా ఒకరిని ఎక్కువ…
లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన రీసెంట్ సినిమా ‘విక్రమ్’ విజయవంతంగా దూసుకుపోతోంది. అంచనాలకు మించే ఈ సినిమా ప్రేక్షకుల్ని విస్తృతంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తమ అద్భుత నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ డిఫరెంట్ అనూభూతిని ఇచ్చాడు. ఇదంతా ఒకత్తైతే.. చివర్లో సూర్య మెరిసిన గెస్ట్ రోల్ మరో ఎత్తు. సూర్య రాకతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. సూర్య గెస్ట్ రోల్లో ఖైదీ సీక్వెల్కి హింట్…
స్టార్ హీరోలకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరి సినిమాలు కళ్లుచెదిరే బిజినెస్ చేస్తాయి. అంతెందుకు.. ఏదైనా ఒక సినిమాలు ఓ చిన్న పాత్రలో మెరిసినా, ఆ హీరోలకుండే స్టార్డమ్ కారణంగా ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిపడుతుంది. అందుకే, స్టార్ హీరోలకు గెస్ట్ రోల్ చేసినా మంచి డబ్బు అందుతుంది. ఈ నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలో తళుక్కుమన్న సూర్య, తాను పోషించిన రోలెక్స్ పాత్రకి ఎంత తీసుకున్నాడనే చర్చ తెరమీదకి వచ్చింది.…