ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అంటే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ అప్పులన్నీ తీరిపోవడమే కాదు దశాబ్దం తర్వాత హిట్ కొట్టాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అనే చెప్పాలి. తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను విజయతీరాలకు తీర్చింది లోకేశ్ అయితే అందులో పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ ప్రముఖులు సినిమా గురించి, కమల్ గురించి ట్వీట్ చేసి అభినందించారు. తాజాగా మహేశ్ బాబు ట్వీట్ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. మహేశ్ తన ట్వీట్ లో కమల్ తో పాటు దర్శకుడు లోకేశ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ‘విక్రమ్’ కంటే ముందు విడుదలైన సంచలన విజయం సాధించిన ‘కెజిఎఫ్2’ గురించి కానీ, దాని దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి కానీ మహేశ్ ట్వీట్ చేయకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
read also: Alluri Sitarama Raju: భీమవరంలో అల్లూరి విగ్రహం ప్రత్యేకతలు తెలుసా?
మహేశ్ ‘కెజిఎఫ్2’ని లైట్ గా తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉందంటున్నారు. నిజానికి ‘కెజిఎఫ్’ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగానే ప్రశాంత్ నీల్ ని అభినందించింది మహేశ్ బాబే. అంతే కాదు తనతో తన తదుపరి సినిమా కూడా చేయాలనుకున్నాడు. అలాగే ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ తో చిత్రాలు చేయాలని భావించారు. ఎన్టీఆర్ తరపున మైత్రీమూవీ మేకర్స్, ప్రభాస్ తరపున వంశీ, ప్రమోద్ ప్రశాంత్ నీల్ ని కలిశారు. అయితే ఏమైందో ఏమో కానీ మహేశ్ తో సినిమా వర్కవుట్ కాలేదు. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రకటనలు వచ్చేశాయి. మహేశ్ తో సినిమా అంటే పారితోషికంతో పాటు పార్టనర్ షిప్ తదితర అంశాలు భాగంగా ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి పట్టువిడుపు ఉండవు. అందుకే మహేశ్ తో ప్రశాంత్ నీల్ సినిమా వర్కవుట్ అయి ఉండదని ఇండస్ట్రీ వర్గాల అంతర్గత వర్గాల మాట. దీంతో మహేశ్ బాబు బాగా హర్ట్ అయినట్లు సమాచారం. అందుకే ‘కెజిఎఫ్ 2’ అంతటి ఘన విజయం సాధించినా మహేశ్ బాబు స్పందించకపోవటానికి కారణమని వినికిడి. కానీ చిత్రపరిశ్రమలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఎప్పటికైనా మహేశ్ బాబు, ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా రావచ్చు. మహేశ్ ఫ్యాన్స్ కూడా వీరి కాంబినేషన్ లో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’, ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. మరి మహేశ్ తో సినిమా ఎప్పుడన్నది కాలమే నిర్ణయించాలి. ఈలోగా మహేశ్, లోకేశ్ సినిమా రావచ్చేమో! లెట్స్ వెయిట్ అండ్ సీ.
Happy Birthday: నూతన దర్శకులకు వరం ఎస్. గోపాల్ రెడ్డి!