Indian 2: కమల్ అభిమానులకు శుభవార్త.. భారతీయుడు-2 మూవీని మళ్లీ మొదలుపెట్టేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan Indian 2: లోకనాయకుడు కమల్ హాసన్ అభిమానులకు శుభవార్త అందింది. పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు మంగళవారం నాడు చిత్ర బృందం వెల్లడించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అయితే కరోనా పరిస్థితులు, షూటింగ్‌లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల కమల్‌హాసన్ ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. బుధవారం నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

Also Read
- Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!


Read Also: Alia Bhatt: ఇష్టం లేకపోతే నన్ను చూడకండి.. స్టార్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఇండియన్ 2 సినిమాను నిర్మిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు రావడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ యువ సంచలనం అనిరుధ్ ఇండియన్ 2 సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. భారతీయుడు-2గా తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది.
#INDIAN2@ikamalhaasan @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ @anirudhofficial #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl @PeterHeinOffl #ANLArasu #RamazanBulut @jeyamohanwriter pic.twitter.com/SMV6Wl00Zr
— Udhay (@Udhaystalin) August 23, 2022
తాజావార్తలు
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!