ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు వైఎస్ఆర్ కల్యాణ మస్తు, షాదీతోపా మూడో విడత ఆర్థిక సాయాన్ని నేడు విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా నిధులను లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఆగస్టు 7న ఉదయం 8:07 గంటల నుంచి 8:17 గంటల మధ్య 26 జిల్లాల్లో కల్యా�