కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా.. ఇద్దరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. పార్టీ తరపున పార్లమెంట్‌లో గళం వినిపించాల్సిన నేతలు.. వ్యక్తిగత విమర్శలతో రచ్చకెక్కారు. పార్టీని బజారునపడేశారు.
Kolkata Rape Case: కోల్‌కతాలో లా విద్యార్థినిపై అత్యాచార ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో వర్గ విభేదాలకు తావిచ్చింది. పార్టీలోని కొందరు నేతలు ఈ సంఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఎమ్మ్యేల మదన్ మిత్రాలు వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ దూరంగా ఉంది. మరో ఎంపీ మహువా మోయిత్రా ఈ ప్రకటనలు ‘‘అసహ్యకరమైనవి’’ అని అభివర్ణించింది.
Waqf: కేంద్ర వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇప్పటికే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉన్నా, కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు పెంచారు.
వక్ఫ్ బిల్లుకు సంబంధించి మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో జరిగిన ఘర్షణ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చర్యలు తీసుకున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ టీఎంసీ ఎంపీని తదుపరి సమావేశం నుంచి సస్పెండ్ చేశారు.
వక్ఫ్ బిల్లుపై మంగళవారం జరిగిన సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో మరోసారి దుమారం చెలరేగింది. సమావేశంలో బీజేపీ, టీఎంసీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై బాటిల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని చేతికి గాయమైంది. సమావేశం అనంతరం గది నుంచి బయటకు వస్తుండగా కళ్యాణ్ బెనర్జీ బొటన వేలికి గాయమైంది. నివేదిక ప్రకారం, బీజేపీ ఎంపీ అభిజీత్ గంగోపాధ్యాయతో వాగ్వాదం జరిగింది. దీనికి ముందు కూడా జేపీసీ…