కాళేశ్వరం పంప్ హౌజ్‌ల ముంపుకు కేసీఆర్ బాధ్యత వహించాలని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చింది అని రైతులు ఏడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖకు మంత్రి లేకపోవడం, సీజన్‌లో అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈటల విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హతకు తగినది కాదని కేంద్రం స్పష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ జాతీయ హోదా కల్పించాలని కోరారని.. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని ఆయన వెల్లడించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును…
టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవ చేసారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలో ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ఫిల్టర్ వాటర్ ప్లాంటులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు పూర్తి చేస్తే వెంకట్ రెడ్డికి పేరు వస్తోందని సీఎం కేసీఆర్ కక్ష కట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదని…
సిద్దిపేటలో రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ అధికారుల రాష్ట్రస్థాయి ఉన్నత అధికారుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ-ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఈఎన్సీ జనరల్ మురళీధర్, ఈఎన్సీ ఇరిగేషన్ గజ్వేల్ హరిరామ్, ఈఎన్సీ ఇరిగేషన్ రామగుండం ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక ప్రతి ఆయకట్టకు నీరు అందించామని, కాళేశ్వరం…
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్బుతం అని అంతా కొనియాడారు. కోటి ఎకరాలకు సాగునీరు అత్యద్భుతం, ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా… ఆ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు ఆగ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. యువకులు ఉపాధి కూడా కోల్పోతున్నారు. రిజర్వాయర్ సామర్ధ్యం పెంపు నిర్ణయంతో పోరుబాటకు సిద్దం అవుతున్నారు రైతులు. ఆ రిజర్వాయర్ నిర్మాణంతో ఊళ్లో పెళ్ళి కాని ప్రసాదులు…
రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి హరీష్ రావు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ పైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నాం. రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించుకున్నాం.కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదు. భూగర్భజలాలు పెరిగాయి.4వేల చెక్ డ్యామ్ లను 6వేల కోట్లతో నిర్మించుకున్నాం.…
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. Read Also: తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం…
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మరో అరుదైన ఘనత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసింది. Read Also: పీఆర్సీ జీవోలను రద్దు చేసి…
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. Read Also: ఎన్నికల…