Gajendra Singh Shekhawat: కాళేశ్వరంలో అవినీతి హద్దులు దాటింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gajendra Singh Shekhawat Comments On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి హద్దులు దాటిందని.. ఇది తెలంగాణ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన ఆరోపణలు చేశారు. భారీ వర్షాల కారణంగా మూడు పంప్‌హౌజ్‌లు మునిగిపోయాయని, పంప్‌లను టెక్నికల్‌గా సరైన పద్ధతిలో అమర్చకపోవడం వల్లే ఆ విపత్తు సంభవించిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేలకోట్ల అవినీతి జరిగిందని, పంప్‌ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉండొచ్చని అన్నారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని, వాటిని అమర్చడంలో సరైన పద్దతి పాటించలేదు కేంద్రమంత్రి దుయ్యబట్టారు.
అంతకుముందు రెండు వారాల కిందట కూడా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వర ప్రాజెక్ట్ రాంగ్ డిజైన్ అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌజ్‌లు మునిగాయని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్‌ను కట్టారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాజెక్ట్ ఒక ఏటీఎంలా మారిందని ఆరోపించారు. డబ్బుల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి లెక్కలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి పరులను జైల్లో వేసేందుకే బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరిన ఆయన.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి నిజమైన నివాళి ఇవ్వాలంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిందేనన్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..