Vijayashanti : కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ప్రజల కంటే కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ లాభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Women Leader Vijayashanti Criticized TRS Government
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని సర్వరోగ నివారిణిగా చెబుతూ… కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా.. తాజాగా సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మూడో టీఎంసీ పనుల్లో స్టేటస్ కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు విజయశాంతి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని స్పష్టం చేసిందని, భూసేకరణ గురించి పక్కనపెడితే… ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌లు లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించిందని విజయశాంతి వెల్లడించారు. భూసేకరణ లావాదేవీలను సమగ్రంగా నమోదు చేస్తామని, భూసేకరణ చట్టబద్ధతను హైకోర్టు తేల్చాలని పేర్కొందని విజయశాంతి తెలిపారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
దీనిపై ఆగస్టు 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు విజయశాంతి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా… ప్రజల కంటే కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ లాభం జరిగింది… జరుగుతోందంటూ విజయశాంతి విమర్శించారు. కమీషన్ల కోసం కక్కుర్తితో… అవసరం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేయించి కేసీఆర్ వేల కోట్లు వెనకేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కనీసం ఆ ప్రాజెక్టుకు… ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌లు కూడా లేవని, ఇప్పటికే గోదావరి వరదలకు కాళేశ్వరం పంపులు పూర్తిగా మునిగిపోయాయని, దీన్ని బట్టే అర్థం అవుతోంది…. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, కమీషన్ల ప్రాజెక్ట్ అని అంటూ విజయశాంతి సెటైర్లు వేశారు. కేసీఆర్… నువ్వు ఎన్ని రోజులు మభ్యపెట్టినా… నీ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉండదంటూ ఆమె వ్యాఖ్యానించారు. త్వరలోనే తెలంగాణ సమాజం నీకు, నీ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెబుతుందన్నారు విజయశాంతి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!