తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీళ్లు రాలేదని కేంద్ర మంత్రులు అంటున్నారు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు... వాళ్లు మీ వైపు వస్తే మీ చెరువులో ముంచండి.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు
తెలంగాణ అభివృద్ధి విషయంలో విమర్శలు చేసేవారికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అంటున్నారు.. మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నీళ్లు విడుదల చేయలేదా…? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి.. రైతు ఆత్మహత్యలు తగ్గాయి.. దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఉందా…? ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా…? అని ప్రశ్నించారు.. లక్ష కోట్లతో కాళేశ్వరం…