Former MP Vivek Venkataswamy Criticized CM KCR.
తెలంగాణలో రాజకీయాలు త్రిముఖ పోరులా మారుతున్నాయి. మరోసారి అధికారంలో రావాలని టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే.. తిరిగి తెలంగాణలో పుంజుకోవాలని కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బీజేపీ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే తాజాగా
కామారెడ్డిలోని మద్నూర్ మండలం కోడిచెర్లలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల పాలయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, లక్షల కోట్లు అప్పు తెచ్చిన సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు.
Etela Rajender : బాంబు పేల్చిన ఈటల.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టు సీడబ్ల్యుసీ అనుమతుల మేరకు జరగలేదని, తప్పుడు డిజైన్ వల్ల లక్ష కోట్ల ప్రాజెక్టు వరద పాలయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ ని ప్రాసిక్యూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన టీఆర్‌ఎస్‌కి 10 సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. మునుగొడులో ఉప ఎన్నిక వస్తదని సీఎం ఇతర పార్టీల లీడర్లను కొంటున్నారని ఆయన విమర్శించారు.