చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు.. ఓటర్లు ఓటు వేయటానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు.. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు.. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎంపీ అరెస్ట్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారు.. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి.. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం దారుణం అన్నారు.. ప్రజలు పోలీసుల కాళ్లు పట్టుకుని మా ఓటు మేము వేసుకుంటాం అని ప్రాధేయపడుతున్నారు.. ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు.. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని వార్నింగ్ ఇచ్చారు
కడప జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు..
కడప జిల్లాలోని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టులు మీద ట్విస్టులు వచ్చి చేరుతున్నాయి... పోలింగ్ అడుగు దగ్గర పడుతూ ఉండటంతో అన్ని పార్టీలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై దృష్టి సారించాయి.. దీంతో ఆ పార్టీలకు నిప్పులాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.. దీంతో దాదాపు నాలుగు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఇక్కడ నెలకొంది.. ఈ అంశంపై వైఎస్‌ఆర్…
పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలు మార్చారా? అంటూ ఫైర్ అయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఈసీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్గొండవారిపల్లె వాసులు ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.. నల్గొండవారి పల్లెలో ఎలా దాడులు చేశారో మనం చూశాం.. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్చడం చూశాం.. కానీ, పోలింగ్ కేంద్రం ఉన్న మార్చారు.. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికి మార్చారా..?…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హాట్ కామెంట్స్ చేశారు ఆయన కూతురు వైఎస్ సునీత.. గత రెండు రోజులుగా పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే నాన్న గారి హత్య గుర్తుకు వస్తుందన్న ఆమె.. గొడ్డలి పోటుతో వివేకా పడి ఉంటే.. గుండె పోటు అని చెప్పారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారు. హత్య తర్వాత లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యం బయటపడుతోందని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజాద్ బాషా మండిపడ్డారు. జగన్ పర్యటనలో భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనకు జన సమీకరణ అవసరం లేదని, స్వచ్ఛందంగా వేలాది మంది తరలివస్తారన్నారు. గత వైసీపీ పాలనలో ఇలానే ఆంక్షలు పెట్టింటే మీరు రాష్ట్రంలో తిరిగే వారా? అని అడిగారు. వైఎస్ జగన్ అంటే మీకు…