Nara Lokesh: లోకేష్ ప్రమోషన్‌ని కావాలనే పెండింగ్‌లో పెట్టారా..?
- తెలుగుదేశం పార్టీ మహానాడుకు ముందంతా ఒకటే చర్చ..
- మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ ఖాయమని ప్రచారం..
- వర్కింగ్ ప్రెసిడెంట్‌షిప్‌పై నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన మహానాడు..
- మహానాడులో టీడీపీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక..
- లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న నేతలు..
- పార్టీ కమిటీలు, పొలిట్ బ్యూరోల్లో మార్పులు చేసినప్పుడే లోకేష్‌కు కూడా..
- పార్టీలోకి యువరక్తం రావాలనుకుంటున్న లోకేష్.. లోకేష్ ప్రమోషన్‌ని కావాలనే పెండింగ్‌లో పెట్టిన బాబు..?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి… కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ధూళిపాల నరేంద్రలాంటివారు లోకేష్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని బలంగా తమ వాణి వినిపించారు. కానీ… అలాంటిదేమీ జరగలేదు. మహానాడులో చంద్రబాబుని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మినహాయించి ఎవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌షిప్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మహానాడు ముగిసింది.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
మహానాడులో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తే తండ్రీకొడుకులు కలిసి పదవులు తీసుకున్నారనే అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్తుంది. అందుకే… ఇది కరెక్ట్ టైమ్ కాదు అని భావించినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్ బ్యూరోల్లో మార్పులు చేసినప్పుడే లోకేష్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే చర్చ మరోవైపు జరుగుతోంది. మహానాడులోనే ఇవ్వాలని నిబంధన లేదు కాబట్టి తర్వాత కూడా లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం… అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ… లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి యువ రక్తం కావాలని లోకేష్ కోరుకుంటున్నారు. దీంతో మార్పులు తప్పనిసరిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే లోకేష్‌కు పదవి ఇచ్చిన తర్వాత పార్టీ మీద మరింత ఎక్కువగా ఫోకస్ పెడతారనే చర్చ కూడా జరుగుతోంది. లోకేష్‌కు ప్రమోషన్ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు కావాలనే పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. తనతో పాటు లోకేష్ కూడా పదవి తీసుకుంటే ఒక ఇంట్లోనే ఇద్దరూ పదవులు తీసుకున్నారనే చర్చ జరుగుతుందని చంద్రబాబు గ్రహించారు. దాంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని బాబు ఆలోచించినట్టుగా సమాచారం. కొంతమందికి పదవులు ఇచ్చి కొన్ని మార్పులు చేసిన తర్వాత పనిలోపనిగా లోకేష్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఆగస్ట్ లోపు లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!