జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది.. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరూ సహకరించాలి అని డీఎస్పీ షరీఫ్ కోరారు.
సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై కడప పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడ్డ 40 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ఉన్న వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్ మెన్ సౌకర్యం కూడా పెంచారు.
కడప గౌస్ నగర్‌లో పోలింగ్ రోజున సాయంత్రం జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. సంబంధిత పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వారికి ఛార్జ్ మెమో జారీ చేశారు జిల్లా ఎస్పీ.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆది నారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.