సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై కడప పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడ్డ 40 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ఉన్న వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని గృహనిర్బంధం, జిల్లా బహిష్కరణ చేస్తామని కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. కౌంటింగ్ అనంతరం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్ ఓపెన్ చేయడంతో పాటు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
READ MORE: IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫోటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసింది చూశారా?
కాగా.. మరోపైపు కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్ మెన్ సౌకర్యం కూడా పెంచారు. దాదాపు 20 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి గ్రామంలో లేకపోయినా వారి ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. ఇక, ఎన్నికల సందర్భంగా బైండోవర్ కేసులలో పూచీకత్తు ఇచ్చి.. ఘర్షణకు పాల్పడిన వారి కూచీకత్తులను రికవరీ చేయడానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జమ్మలమడుగులోని వైసీపీ, టీడీపీ, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసుల పికెటింగ్ సైతం కొనసాగుతుంది.