కాబూల్ బ్లాస్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 150 దాటిందని తెలుస్తోంది. మరికొంత మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటు కాబూల్ ఎయిర్ పోర్టుకు ఉగ్రవాదుల నుంచి మరోసారి ముప్పు పొంచి ఉందని అమెరికా సహా అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు బాంబు దాడుల భయం ఉన్నా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎయిర్ పోర్టు గుంపులు గుంపులుగా తరలి వస్తూనే ఉన్నారు. ఇటు,…
కాబూల్ ఎయిర్‌పోర్ట్ వరస బాంబు పెలుళ్లతో దద్దరిల్లిపోతున్నది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ వద్ద 6 పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులు 60 మంది ఉండగా, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. 160 మందిలో 145 మంది…
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్‌లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం.…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తరువాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే అమెరికా దళాలను ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే, నిన్నటి రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు ఎవరూ రావొద్దని అగ్రదేశాల నిఘా సంస్థలు హెచ్చరించారు. ఈహెచ్చరికలు జరిగిన గంటల వ్యవధిలోనే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద రెండు బాంబుదాడులు జరిగాయి. ఈ దాడిలో 72 మంది మృతి చెందగా, 140…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వీలైతే ఎలాగైనా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఏదోక విమానం ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇక, ఆగస్టు 31 వరకు తాలిబన్లు ఎయిర్‌పోర్టులోని అమెరికా, నాటో దళాలకు డెడ్‌లైన్ విధించారు. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వారంతా వెళ్లిపోవాలని షరతు విధించారు. అందుకు తగ్గట్టుగానే అమెరికా, నాటో దళాలు ప్రజలను తరలిస్తున్నాయి. అయితే, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్‌పోర్టుకు కొత్త వ్యక్తులు…
కాబూల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా అమెరికాతో సహా అనేక దేశాలు తమ పౌరులను, ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వివిధ దేశాలకు తరలిస్తున్నాయి. తాలిబన్ల భయంలో ఆఫ్ఘన్ ప్రజలు వివిధ దేశాలకు తరలివెళ్తున్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా కాబూల్ నగరం నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారిపై తాలిబన్లు దృష్టిసారించారు. ఎయిర్‌పోర్టువైపు వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. కాల్పులు జరుపుతున్నారు. తాజాగా ఈరోజు మరోసారి తాలిబన్లు కాల్పులకు…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు కాబూల్ నగరంలో హ్యాపీగా తిరుగుతున్న యువత ఒక్కసారిగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఆఫ్ఘనిస్తానీయులు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో అమెరికా సీ 17 విమానం ద్వారా రికార్డ్ స్థాయిలో 640 మందిని తరలించారు. ఇది పాసింజర్ రైలు కాదని, అమెరికా సీ 17 విమానం అని అమెరికా ఆర్మీ పేర్కొన్నది. అయితే, ఆ విమానంలో ప్రయాణం చేసింది640 మంది కాదని,…
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో అరాచకం రాజ్యమేలుతోంది… తాలిబన్లు తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఆఫ్ఘన్ రాజధానిలోని కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర తాలిబన్లు గాల్లోకి కాల్పలులు జరిపారు.. ఇతర దేశస్తులతో పాటు.. ఆఫ్ఘన్‌లు దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌లకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు.. అయితే, వారిని నిలువరించడానికి కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర కాల్పులు జరిపారు తాలిబన్లు.. దీంతో.. భయాందోళనకు గురైన ప్రజలు.. ఒక్కసారిగా పరుగులుపెట్టారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి…
తాలిబన్ల పాలన మాకొద్దు.. అంటూ లక్షలాది మంది కాబుల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ బయట తాలిబన్లు.. లోపల విదేశీ బలగాలు పహారా కాస్తున్నాయ్. రోజులకొద్దీ అక్కడే ఉండటంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల ఆర్తనాదాలు, పసి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయ్. కొందరైతే తమ పిల్లలైనా కాపాడాలంటూ పిల్లలను విదేశీ బలగాలకు ఇచ్చేస్తున్నారు. ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల…