ఇక యుద్ధం ముగిసింది అని ప్రకటించిన తాలిబన్లు.. ఆ తర్వాత తమ ప్రకటనకు విరుద్ధంగా డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహిస్తూ అందరనీ ఆశ్చర్య పరిచారు.. మరోవైపు.. ఇప్పుడు దాదాపు 150 మందిని కిడ్నాప్ చేసి మరింత రెచ్చిపోయారు. కాబూల్ సైతం తాలిబన్ల వశం కావడంతో.. భారత్ సహా చాలా దేశాలు.. ఆఫ్ఘన్‌లోని రాయబార కార్యాలయాలను ఖాళీ చేసి.. స్వదేశాలకు తరలిపోయాయి. ఖాళీగా ఉన్న కార్యాలయాల్లోకి చొర్రబడి దౌత్యపత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని తాలిబన్లు తనిఖీలు కూడా నిర్వహించారు.…
ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్‌తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్‌పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…
తాలిబన్లు కాబూల్‌లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్‌లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో…