TKA : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ను తీవ్ర ఆరోపణలు కకావికలాన్ని సృష్టిస్తున్నాయి. అసోసియేషన్‌లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తోట సురేష్ చేసిన ఫిర్యాదులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ యాదవ్ , కోశాధికారి కె.బి. శ్రీరాములుపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత 40…
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు.
సరదాగా ఆడిన ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. విజయనగరంలో జిల్లాలోని పూసపాటిరేగ మండలం ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా 4 గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి.
Minister Roja: చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కిందపడిపోవడంతో ఒక్కసారిగా అధికారులు, అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు.…
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 7, 2022న ప్రారంభమై డిసెంబర్ మధ్యకాలం వరకు కొనసాగనుంది.