జర్నలిస్టు నుంచి రాజకీయనాయకుడిగా మారి శాసనసభలో అడుగుపెట్టిన క్రాంతి కిరణ్ నిత్యం చురుకుగా వుంటారు. తాజాగా ఆయన కబడ్డీ కబడ్డీ అంటూ గ్రామాల్లో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. రాష్ర్టంలో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ క్రీడా మైదానాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంతురూ, సింగూర్,బస్వపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి క్రీడా మైదానాన్ని…
ఒకవైపు రాజకీయాలు, మరోవైపు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ బాధ్యతలు. జబర్దస్త్ జ్యూరీ క్షణం కూడా తీరిక లేని రోజా క్రీడల్లోని పాల్గొని అభిమానులను, నియోజకవర్గ ప్రజలను ఉత్సాహ పరుస్తూ వుంటారు. గతంలో కబడ్డీ ఆడిన రోజా తన భర్తకే చుక్కలు చూపించారు. ఆయన్ని ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. ALSO READ: ఎమ్మెల్యే రోజా కబడ్డీ .. కబడ్డీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో మంచి విధానాలతో ప్రతి విషయంలో…
నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆటవిడుపుతో అలరించారు. తన నియోజకవర్గమయిన నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తనకెంతో ఇష్టమయిన కబడ్డీ ఆడి అలరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి. గతంలోనూ అనేక సార్లు రోజా కబడ్డీ ఆడారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అంతా పాటు పడాలన్నారు. ఖాళీ వున్నప్పుడల్లా కబడ్డీ ఆడాలన్నారు.
బోర్డర్‌లో నిత్యం పహారా కాసే సైనికులు కబడ్డీ అడుతూ కనిపించారు. భారత్, అమెరికా దేశాల సైనికులు యుద్ద్ అభ్యాస్ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని అలస్కాలో ఈ యుద్ద్ అభ్యాస్ విన్యాసాలు జరుగుతున్నాయి. అక్టోబర్15 నుంచి 29 వరకు ఈ విన్యాసాలు జురుగుతాయి. ఇండియా నుంచి 350 మంది, అమెరికా నుంచి 300 సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, వీరి మధ్య మంచి వాతావరణం నెలకొల్పేందుకు వివిధ రకాల క్రీఢలను…
ఒకప్పుడు అతను కబడ్డీలో ఛాంపియన్. రాష్ట్రం తరపున కబడ్డీ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. కొడుకు కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన చేయాతను అందించారు. వారి కష్టం ఊరికే పోలేదు. కొడుకు రాష్ట్రస్థాయిలో రాణించాడు. మంచి ప్రతిభను చాటుకున్నాడు. ఇదంతా గతం. ప్రస్తుతం తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉండటం వలన వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బడ్డీకొట్టు నడుపుతున్నాడు. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. Read: “ఛత్రపతి”…