ఆటలు, సరదాలు.. బాల్యం అదో అనుభూతి.. జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎన్నో అనుభూతులు.. అవన్నీ ఒకప్పుడు.. ఇప్పుడు అవేం కనిపించడం లేదు. ఆటలంటే స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ మాత్రమే. ఒకప్పుడు ఒంటినిండా చెమట పట్టి, ఆరోగ్యం వచ్చేది. కానీ ఇప్పుడు ఏసీ రూముల్లో మంచాల మీద, కుర్చీల్లో, సోఫాల్లో కూర్చుని ఆడేసుకుంటున్నారు. శరీరక సౌష్టవం కోసం, మానసిక ఉల్లాసం కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఆటలు మనం పరిగణిస్తుంటాం. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉండేవారు. సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ ఇంటికో, మేనత్త ఇంటికో వెళ్లి హాయిగా ఆటలాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు.
వైకుంఠ పాళీ, గోటిబిళ్ళ, బిళ్ళంగోడు, గిల్లి డండా, ఛిల్లా కట్టే.. ఇలా ఎన్నో ఆటలు. ఇప్పుడు ఇవేం కనిపించడం లేదు శారీరక శ్రమ లేనేలేదు. కబడ్డీ, క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ లాంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. కోతి కొమ్మచ్చి, దొంగ పోలీస్, నేల-బండ, తొక్కుడు బిళ్ళ, బొమ్మల పెళ్ళి ఇలాంటివి కనుమరుగు అయిపోయాయి. సోషల్‌మీడియా, వీడియోలు, ఇంటర్నెట్ గేమ్స్‌లో తలమునకలు అవుతున్న యువత అనేక బాల్య స్మృతుల్ని కోల్పోతోంది. చిన్న వయసు పిల్లలు 3 గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
మూడేళ్ళ వయసు పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారారు. చేతిలోంచి ఫోన్ లాక్కుంటే రెండేళ్ళ లోపు పిల్లలు ఏడుపు లంకించుకుంటారు. కోవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దారుణంగా దెబ్బతీసింది. దీంతో వారంతా స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. ఆన్‌లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్‌ఫోన్లు చేతికివ్వాల్సి వచ్చింది. కొవిడ్ మనల్ని వీడినా స్మార్ట్‌పోన్ల వాడకం అలవాటు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ వద్దంటే గోలగోల
దేశవ్యాప్తంగా 287 జిల్లాల నుంచి 65 వేల మంది పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఓ సర్వే సంస్థ. 9-13 ఏండ్ల వయసు పిల్లలు 3 గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్‌లోనే వుండిపోతున్నారు. వారి కళ్ళు స్మార్ట్ ఫోన్ల పైనే ఉండిపోతున్నాయి. 13-17 ఏండ్ల వయసు పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు బానిసలైనట్టు 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. మూడు గంటలకుపైగా సోషల్‌మీడియా, వీడియోలు, ఇంటర్నెట్ గేమ్స్‌ల్లో పిల్లలు తలమునకలవుతున్నట్టు 62 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం.. వంటివి ఖాతాలు సృష్టించుకోవడానికి అనుమతులివ్వగా.. పదేండ్లలోపు పిల్లలు కూడా తప్పుడు వయసుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటిపై ఆయా సంస్థలు నివారణ చర్యలు చేపట్టడంలేదు. దీంతో ఫోన్‌కు బానిసై మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వయో పరిమితిని 15 ఏండ్లకు పెంచాలని 68 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా వారికి సోషల్ మీడియా ఖాతాలు ఇవ్వకూడదు. కానీ అవేం జరగడంలేదు.
Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో పవన్.. డీవీవీ నుంచి ప్రకటన వచ్చేసింది
నిబంధనలు తోసి రాజని చిన్నారులకు ఖాతాలు ఎడాపెడా తెరిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, వ్యాపారులు కావడం వల్ల వారిపై అజమాయిషీ వుండడంలేదు. ఒత్తిడి దూరం కావడానికి 13శాతం మంది స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. స్కూల్ కార్యక్రమాలు ఆన్‌లైన్ కావడం వల్ల 26శాతం మందికి అలవాటయ్యాయని తెలుస్తోంది. యథా పేరెంట్స్… తథా చిల్డ్రన్స్ అన్నట్టుగా తల్లిదండ్రులు ఎక్కువగా గాడ్జెట్స్ వాడటం వల్ల 31శాతం పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్లకు పిల్లలు త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రుల మీద వత్తిడి తెచ్చి మరీ కొత్త గాడ్జెట్స్ కొనేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాల్యం స్మార్ట్ ఫోన్లకు బందీ అయి, ఉల్లాసంగా మాయం అయ్యే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Myanmar: కాలేజ్ విద్యార్థులకు ఉరిశిక్ష.. సైనికపాలకుల దురాగతం