ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిత్యం జనంలో వుంటారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయో లేదో ఆయనే స్వయంగా పరిశీలిస్తూ ఉంటారు. అయితే ఆయనకే మైండ్ బ్లాక్ చేశాడో అబ్బాయి. తన ఆకస్మిక పర్యటనలో భాగంగా కేతిరెడ్డికి వింత అనుభవం ఎదురైంది. లావుగా వున్న ఒక అబ్బాయిని పలకరించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పర్యటించారు కేతిరెడ్డి. ఆయన ఒక అబ్బాయిని పిలిచి ఎందుకు లావు అవుతున్నావు. గేమ్స్ ఆడవచ్చు కదా అని అడిగారు ఎమ్మెల్యే. దీనికి బాలుడిచ్చిన సమాధానంతో షాకయ్యారు ఎమ్మెల్యే.
అమ్మ ఫోన్ ఇవ్వడం లేదని జవాబిచ్చాడు. ఏంటి నేనంటున్నది గేమ్స్ ఫోన్ లో ఆడమని కాదు.. గ్రౌండ్ లో ఆడు అన్నారు. ఆడుతున్నా.. కబడ్డీ అన్నాడు. కబడ్డీ కాదు కాస్త ఒళ్ళు తగ్గించే గేమ్స్ ఆడమన్నారు. బాలుడి సమాధానానికి అక్కడున్నవారు అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. గేమ్స్ ఆడడం అంటే ఈతరం పిల్లలకు స్మార్ట్ ఫోన్ లో అన్నట్టుగా తయారైందంటున్నారు. సరైన వ్యాయామం లేకపోవడంతో పిల్లల్లో స్థూలకాయం పెరిగిపోతోంది.