Asian Games 2023: భారత్కు పతకాల పంట.. కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 17-13 పరుగుల తేడాతో మంచి ఆధిక్యంలో నిలిచిన టీమిండియా.. సెకండ్ హాఫ్‌లో ఇరాన్ ఊహించని విధంగా పునరాగమనం చేశారు. దీంతో 19-24 స్కోరు నుంచి 25-25 పాయింట్లతో స్కోర్లను సమం చేసింది. ఆ తర్వాత ప్రతీ పాయింట్ కోసం ఇరు జట్ల మధ్య ఉత్కంఠ నెలకొంది.
Hamas Attack On Israel: “ఈ దాడి గర్వంగా ఉంది”.. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు..
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఇదిలా ఉంటే.. మరో 65 సెకన్లలో ఆట ముగుస్తుందని పవన్ చేసిన రైడ్ విషయంలో ఇరు జట్ల మధ్య గొడవ జరిగింది. డూ ఆర్ డై రైడ్‌కి వెళ్లిన పవన్, డిఫెండవర్లు ఎవ్వరినీ తాకకముందే లాబీలోకి ఎంటర్ అయ్యాడు. అయితే అతన్ని అవుట్ చేసేందుకు ప్రయత్నించిన ఇరాన్ డిఫెండర్లు ముగ్గురు లాబీలోకి ఎంటర్ అయ్యారు. ఈ రైడ్‌పై ఇరాన్‌కి ఒక్క పాయింట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు రిఫరీ. అయితే భారత్ రివ్యూ తీసుకోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీనిపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆటకు కాసేపు అంతరాయం కలిగిన తర్వాత అంపైర్లు, భారత్‌కి 3 పాయింట్లు, ఇరాన్‌కి ఒక్క పాయింట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Dussehra Holidays: మారిన దసరా సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
దీంతో దాదాపు గంటకు పైగా మ్యాచ్ ఆగిపోయింది. భారత్, ఇరాన్ అధికారులు.. అంపైర్లతో చర్చించిన తర్వాత భారత్‌కి 3 పాయింట్లు ఇవ్వడంతో మ్యాచ్ తిరిగి 31-29 దగ్గర ప్రారంభమైంది. డూ ఆర్ డై రైడ్‌కి వచ్చిన ఇరాన్ రైడర్‌ని టీమిండియా ఔట్ చేయగా.. ఆ తర్వాత ఆఖరి రైడ్‌లో మరో పాయింట్ చేశారు. దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం దక్కింది. 1990, 1994, 1998, 2002, 2006, 2010, 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత కబడ్డీ పురుషుల జట్టు, గత ఏషియన్ గేమ్స్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి మరోసారి భారత కబడ్డీ జట్టు స్వర్ణంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. భారత మహిళా కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు