Marriages:శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
ఇక శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు…అంటున్నారు పురోహితులు. అవును మరి…వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ముహూర్తాలు ఉండవట. అందుకే తల్లిదండ్రులు హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడక తప్పదు గనుక ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
మూర్తాలు తక్కువ కావడం..
కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవడం, నిబంధనల కారణంగా వివాహాల సంఖ్య తగ్గడం, వాయిదాపడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి.. జరుగుతున్నాయి.. ఈ నెల (మే) తర్వాత జూన్ మినహా (ఆగస్టులో కొద్దిగా) డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు.
ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో మళ్లీ మన వైపు చూస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. ఆ.. ఏం కాదు…నిదానమే ప్రధానమని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. కానీ నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పలుచోట్ల డిసెంబరు వరకు కల్యాణ మండపాలు రిజర్వు అయిపోయాయి. డెకరేషన్, కేటరింగ్ తదితరాలకు కూడా టోకన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.
గండం దాటుకుంటాం
ఐదు నెలలుగా జరుగుతున్న వివాహాల వల్ల జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాక ధరలు రోజురోజుకు పెరుగుతున్నా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్ తగ్గడం లేదు. వరుసగా రెండేళ్లపాటు దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ వివాహాల ద్వారా కోలుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరిగాయి. దీంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భయపెడుతున్న బంగారం
రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమైన తల్లిదండ్రులు అవసరమైన బంగారం కొంటున్నారు. ప్రస్తుత ధరల్లో తులం బంగారంతో ఆభరణం చేయించాలంటే రూ. 55–60 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కానీ వివాహాలలో బంగారం ప్రధానపాత్ర పోషిస్తుండడంతో దాన్ని కొనేందుకు తల్లిదండ్రులకు తప్పడం లేదు. దీంతో ఇటీవల బంగారం ధర పెరిగినా కొనుగోలు కూడా పెరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు.
రికార్డు స్థాయిలో
గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల 18 వరకు మొత్తం 37 ముహూర్తాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చిన్న, ఓ మోస్తరు వివాహాలు ఇప్పటివరకు ఐదు వేలు జరగ్గా, భారీ వివాహాలు దాదాపు 1000 వరకు జరిగినట్లు ఆయా వర్గాల సమాచారం.
వీటి ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరో రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా.
YS Jagan: భారీ విద్యుత్ ప్రాజెక్టు.. నేడే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!