Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనలను హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులపై మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్ లపై రెండు కేసులు నమోదు కాగా, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ పై మరో కేసు నమోదైంది.
12A Railway Colony : అల్లరి నరేశ్ ‘12ఎ రైల్వే కాలనీ’ మూవీ ట్రైలర్ రిలీజ్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు హైదరాబాదు సిటీ పోలీస్ విభాగం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా సాగాలంటే ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు.
Bihar Exit Polls: బీహార్ ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనం.. అధికారంలోకి వచ్చేది ఈ కూటమే..