జార్ఖండ్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు.
Jharkhand Elections: రేపు జార్ఖండ్ చివరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్‌లోని 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి అయితే, ఇప్పుడు బీహార్ పూర్నియా నుంచి పోటీ చేసి గెలుపొందిన ‘‘పప్పూ యాదవ్’’ ప్రచారం వైరల్‌గా మారింది. ఇండియా కూటమి తరుపున ఓట్లు అడుగుతున్న ఆయనకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది.
జార్ఖండ్‌లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది.. ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించింది. రాంచీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
హర్యానా ఫలితాల తర్వాత ఇండియా కూటమి అప్రమత్తమైంది. సాగదీతలు.. నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. హర్యానా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని ముందు జాగ్రత్తగా సీట్ల పంపకాలపై కూటమి దృష్టి పెట్టింది. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది.