Jharkhand polls: ఫేజ్-2లో సగం అభ్యర్థులు కోటీశ్వరులే.. అత్యల్ప అభ్యర్థి ఆస్తి ఎంతంటే..!
- జార్ఖండ్ ఫేజ్ 2 పోలింగ్‌లో సగం అభ్యర్థులు కోటీశ్వరులే
- అక్విల్ అక్తర్ రూ.402 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే సెకండ్ ఫేజ్‌లో సగం మంది కోటీశ్వరులే పోటీ చేస్తున్నట్లుగా ఏడీఆర్ నివేదికను బట్టి తెలుస్తోంది. డజన్ల కొద్దీ కోటీశ్వరులు రెండో దశ పోలింగ్ కోసం పోరాడుతున్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 522 మంది అభ్యర్థుల్లో 127 మంది కోటీశ్వరులే.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుంది
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ఏడీఆర్ నివేదిక ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ (SP) పకూర్ అభ్యర్థి అక్విల్ అక్తర్ రూ.402 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అత్యల్ప అభ్యర్థి ఆస్తి రూ.100 ఉన్నట్లు డిక్లరేషన్ ప్రకటించారు. అక్తర్ దాదాపు కోటి ( రూ.99,51,816) విలువైన చరాస్తులను ప్రకటించగా … అతని స్థిరాస్తులు రూ. 400 కోట్లకు పైగా ( రూ. 4,02,00,00,000) ఉన్నట్లు తెలిపారు. అక్విల్ అక్తర్ తర్వాత ధన్వర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరంజన్ రాయ్ ఆస్తి రూ. 137 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాడు. మూడవ స్థానంలో ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ధన్వర్ అభ్యర్థి మిహమ్మద్ డానిష్‌కు రూ. 32 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. మహేశ్‌పూర్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్ పీపుల్స్ పార్టీ ఇలియన్ హన్స్‌దక్ ఆస్తులు సున్నా అని ప్రకటించారు. బీజేపీలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరుల అభ్యర్థులు ఉన్నారు. 32 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, ఇతర పార్టీలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి ఫేజ్‌లో 43 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 5న ముగుస్తుంది.
ఇది కూడా చదవండి: Stephen Miller: ట్రంప్ మిల్లర్ ఎంపికలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బందే..
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!