Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చని ఆదేశాలను కాపాడేందుకు కాంగ్రెస్ జోక్యం చేసుకుందని అన్నారు.
Hemant Soren: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ని శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో కేసులో హేమంత్ సోరెన్‌ను ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, దీనిపై ఆయన ఏక కాలంలో జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.
ఝార్ఖండ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. క్షణక్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఇంకా గవర్నర్ ఆహ్వానించలేదు
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు.