Champai Soren flew to Delhi: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలు ఉన్నాయి. చంపైతో పాటు పలువురు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ బృందం ఢిల్లీ పయనమయ్యారని సమాచారం. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చంపై బీజేపీలో…
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన తాజాగా మీడియాతో స్పందించారు. ప్రస్తుతం ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయో తనకు తెలియదన్నారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత వారం హస్తిన పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి హేమంత్ పలువురి ప్రముఖలను కలిశారు. ఇక సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు.
జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి హేమంత్ సోరెన్ అధిరోహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు.
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీతా సోరెన్‌పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడింది.
కల్పనా సోరెన్.. తన భర్తను తలచుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ తన భర్త, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Jharkhand: జార్ఖండ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో చంపై సొరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం ‘ఫ్లోర్ టెస్ట్’ ఉంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు.