జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అన్ని విధాలా ప్రయత్నించినా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చివరకు బీజేపీ ఎక్కడ తప్పు చేసిందనేది ప్రశ్న పార్టీ నేతల్లో తలెత్తుతోంది.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా ఈ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ ఓకే చెప్పారని పేర్కొన్నారు.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు.
Jharkhand Elections 2024: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో పాల్గొననున్నారు.
దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది.
Shivraj Chouhan: జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక హామీ ఇచ్చింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్(ఎన్ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.