Jharkhand Elections 2024: నేడు జార్ఖండ్‌కు రాహుల్ గాంధీ.. రేపు అభ్యర్థుల ఎంపికపై చర్చ
- నేడు జార్ఖండ్‌కు రాహుల్ గాంధీ..
- రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సుకు హాజరు..
- 500 మందికి పైగా ప్రతినిధులతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Elections 2024: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో పాల్గొననున్నారు. 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన మాట్లాడనున్నారు. జార్ఖండ్ పర్యటనలో రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా భేటీ కానున్నారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లిన తర్వాత రేపు (అక్టోబర్ 20న) కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరగనుంది. జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ ఆఫీసులో జరిగింది. అభ్యర్థుల పేర్లపై భేటీలో చర్చించారు. రాష్ట్ర ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: Prabhas Prashanth Varma : ఏంటి అస్సలు ఊహించలేదే.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోనా ?
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఇక, ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు తర్వాత కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం క్యాండిడెట్ల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా కొనసాగుతుంది.. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించాం.. రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా చర్చలు జరిగాయని ఆయన అన్నారు. కాగా, రేపు (ఆదివారం) మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?