జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది.
హర్యానా ఫలితాల తర్వాత ఇండియా కూటమి అప్రమత్తమైంది. సాగదీతలు.. నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. హర్యానా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని ముందు జాగ్రత్తగా సీట్ల పంపకాలపై కూటమి దృష్టి పెట్టింది. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సతీమణి కల్పనా సోరెన్‌తో కలిసి ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిశారు. హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాతే భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈడీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ..ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్ నుసుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. టూర్‌లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కలిసి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు
Jharkhand Chief Minister H Soren Summoned Tomorrow In Mining Scam Case: అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగం పెంచింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు రావాల్సిందిగా కోరింది. రాంచీలోనీ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో రేపు విచారణకు జరగనుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ జూలైలో…
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దయింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తనకు తాను మైనింగ్ లీజును పొడగించడం ద్వారా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ కు పంపింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ లో పంపినట్లు…