Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఫిక్స్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
- అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం
- మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్
- ఈ నెల 26 ప్రమాణస్వీకారోత్సవం
- హాజరు కానున్న పలువురు ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.
READ MORE: Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Also Read
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసి.. అధికారాన్ని నిలుపుకుంది. 81 సభ్యుల అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) – నేతృత్వంలోని రాష్ట్రీయ డెమోక్రటిక్ కూటమి (ఎన్‌డిఎ) కేవలం 24 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
READ MORE: Alcohol: మద్యం మానలేక పోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యం కొంతైన మెరుగవుతుంది?
రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. కాంగ్రెస్‌కు 16, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ నాలుగు, సీపీఐ (ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరీక్షలో పార్టీ విజయం సాధించిందని అన్నారు.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!