జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. టూర్‌లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని కలిసి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. అక్కడ సునీతా కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కలిశారు. అనంతరం తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. సోనియాతో భేటీ అనంతరం హేమంత్ మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే సోనియాను కలిసినట్లు తెలిపారు. జైలు నుంచి వచ్చాక.. కలవలేకపోయానని.. ఇప్పుడు వచ్చి కలిసినట్లు వెల్లడించారు. రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆయనకు బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. అనంతరం తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఇటీవలే రాంచీ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణస్వీకారం చేశారు. జైలుకు వెళ్లినప్పుడు చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామాతో తిరిగి హేమంత్ సీఎం సీటును అధిరోహించారు. ఇక కేబినెట్‌లో చంపై సోరెన్‌కు చోటు కల్పించారు.
#WATCH | Jharkhand CM Hemant Soren along with his wife Kalpana Soren meets Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal and AAP MP Sanjay Singh at the Chief Minister's residence in Delhi.
(Source: AAP) pic.twitter.com/RqMepnBGmb
— ANI (@ANI) July 13, 2024