Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
Pakistan: పాకిస్తాన్ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హమాస్ నాయకులు హల్‌చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
Masood Azhar: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారతదేశంలో పుల్వామా వంటి ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా ఉన్న అజార్, మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని, చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ ను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదులను జైష్…