Hamas: పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం.. ఉగ్రవాదులు భారీ ర్యాలీ
- పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం
- కార్లు, బైకులు, గుర్రాలతో ఘనస్వాగతం
- భారత నిఘా వర్గాలు అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హమాస్ నాయకులు హల్‌చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
ఇది కూడా చదవండి: VinFast VF 3: నానో కంటే మరో చిన్న కారు.. ఊపు ఊపేయడానికి వస్తున్న ఈవీ
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఫిబ్రవరి 5, 2025 (బుధవారం) పాకిస్థాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు.. రావలకోట్‌లోని షహీద్ సబీర్ స్టేడియంలో భారత వ్యతిరేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హమాస్‌కు చెందిన ఉగ్రవాదులు హాజరయ్యారు. హమాస్ జెండాలు పెట్టుకున్న లగ్జరీ ఎస్‌యూవీ కార్లు, బైకులు, గుర్రాలతో భారీ ర్యాలీగా వెళ్లి ఘనస్వాగతం పలికారు. జైషే ఉగ్రవాదులు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. పూల వర్షం కూడా కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే హమాస్.. తన సామ్రాజాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: S Jaishankar: అమెరికా నుంచి భారతీయులను బహిష్కరించడంపై స్పందించిన జైశంకర్..
భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు హమాస్ తన సామ్రాజ్యా్న్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, జైష్ కమాండర్ అస్గర్ ఖాన్ కాశ్మీరీతో సహా అగ్ర ఉగ్రవాద నాయకులంతా హాజరయ్యారు. ఇక ఇరాన్‌లో హమాస్ ప్రతినిధి బృందానికి నాయకుడైన ఖలీద్ అల్-ఖాదౌమి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గతంలో అనేక మంది హమాస్ నాయకులు.. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. దక్షిణాసియాలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CRDA Letter to Election Commission: రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!