జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్ఠానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు.
50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్, లక్ష రూపాయలు పెళ్ళికానుక, పది లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
సమిష్టిగా కృషిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలోని కళ్యాణ మండపం నందు సీతారాంపురం ఉదయగిరి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశంతో పాటు పరిచయ కార్యక్రమాన్ని ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, సీతారాంపురం మండల కన్వీనర్ ప్రభాకర్ రాజులు నిర్వహించారు.
Pawan Kalyan’s Tenali Tour Cancelled: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి. Also Read: Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?:…