జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.
నాల్గో రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నేడు స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య క్రిస్టియన్ అని గుర్తుచేశారు.. అయితే, నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించును అన్నారు. ఇక, మా కుటుంబంలో సర్వ మతాలను గౌరవించేవారు.. అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అంతేకాదు.. జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్లానని…
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు.