అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు.
జనసేన పార్టీకి షాక్ ఇస్తూ.. రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ జనసేన ఇంఛార్జ్‌గా ఉన్న పోతిన మహేష్.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో జనసేన, పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి రాజీనామా ఆవేశంలో చేయలేదు.. సీటు రాలేదని నేను రాజీనామా చేయటం లేదన్నారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశాం.. 2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి…
"ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు.." అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.