పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడు అయ్యింది.. ప్రజాగళంకు వారాహి తోడు అయ్యింది.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు అని పేర్కొన్నారు. సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి పవన్.. ఓటు చీలనివ్వను అన్న మాటను పవన్ నిజం చేశారు.. కూటమిగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తే వైసీపీకి డిపాజిట్లు రావు అని ఆయన చెప్పుకొచ్చారు. మీరు ( ప్రజలు ) కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కి పారిపోతాడు.. ఈ విధ్వంస పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా మీరే ఆలోచించుకోండి.. పది ఇచ్చే వంద దోచేసే దొంగలు కావాలా.. సంపద సృష్టించే పాలన కావాలా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
Read Also: Paarijatha Parvam Trialer : కిడ్నాపర్ గా మారిన సునీల్..పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్న ట్రైలర్..
రాష్ట్రంలో జే బ్రాండ్ ను పూర్తిగా నిషేదిస్తాం అని చంద్రబాబు తెలిపారు. కూటమికి ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. గోనే సంచులు ఇవ్వలేని మంత్రి ఇక్కడే ఉన్నాడు.. రైతులను ఆదుకుంటాం.. మొదటి సంతకం మెగా డీఎస్సీ పై పెడతాం.. రాష్ట్రంలో బాగిపడింది ఒక్క జగన్ మాత్రమే.. ఎన్నికల సమయం కాబట్టి, ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి ప్రశాంతంగా సభలు పెట్టగలుగుతున్నాం.. లేదంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని తిరగనిచ్చేదా అని ఆయన చెప్పుకొచ్చారు. దోపిడి, దుర్మార్గ ప్రభుత్వాన్ని బూడిద చేసే రోజు మే 13న వస్తుంది.. ఆలోచించి ఓటు వేయండి.. మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కావాలి.. జగన్ ఒక ఫేక్ ఫెలో.. సోషల్ మీడియా చూస్తే మీకే అర్థం అవుతుంది.. మేము కలిసే ఉంటే సోషల్ మీడియాలో మేము సంతకాలు పెట్టినట్టు.. ఇవ్వన్నీ స్టేట్ మెంట్లు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు.. దొంగలు పెట్టే ఫేక్ మెసేజ్లు నమ్మకండి.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పరదాలు కట్టుకు తిరిగారు.. ఐదేళ్లలో ఎవ్వరినీ కలవకుండా ఉన్న జగన్ మళ్లీ వస్తున్నాడు.. మీ మీద ప్రేమతో కాదు ఓట్ల కోసం మాత్రమే అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
వాలంటర్ల వ్యవస్థ ఉంటుంది.. వాలంటీర్లకు ఐదు నుంచి పది వేలు ఇస్తామంటే వైసీపీకి ఏం చేయాలో అర్థం కావడంలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ వాళ్ళు చెప్పినా వాలంటీర్లు రాజీనామా చేయకండి.. వాలంటీర్లు ఎవ్వరూ లేరు అని మంత్రి ధర్మాన అంటున్నారు.. రాజీనామాలు చేసింది రెండు శాతం మాత్రమే.. స్థానిక శాసన సభ్యుడు కారుమూరు నా జీవితంలో నేను చూడనంత ముదురు.. ఈయన్ని చూసి అనేక మంది తయారయ్యారు.. వారాహి యాత్ర విజయవంతం అయితే, కారుమురి జనసేన కార్యకర్తలపై దాడి చేయించారు అని ఆయన ఆరోపించారు. అదే కళ్యాణ్ కన్నెర్ర చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.. అందరికీ సీట్లు రాలేదు.. పవన్ బాగా తగ్గారు, నేను తగ్గా, బీజేపీ కూడా తగ్గింది అన్నారు. మా కలయిక ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే అని చంద్రబాబు నాయుడు తెలిపారు.