కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి.
ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కాకినాడ పర్యటన పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాకినాడ సిటీ నియోజక వర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని.. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల సమీక్ష చేపట్టిన ఆయన కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు.. దీనికోసం బుధవారం రోజు కాకినాడ చేరుకున్నారు జనసేనాని.. ఇక, మూడు రోజుల పాటు అంటే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అక్కడే మకాం వేయనున్నారు.